తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో.. పదో తరగతి పరీక్షలను నిర్వహించడంలేదు. ఇంటర్నల్‌ అసెస్మెంట్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌ లను నిర్ణయించారు. పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా అధికారులు ప్రకటించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు ఉన్నారు. రెగ్యులర్‌ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు.. 2,53,661 మంది బాలికలు ఉన్నారు. ఇక 2 ,10,647 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ సాధించారు. ఇక మొత్తం 535 పాఠశాలలు 10/10 జి.పి.ఎ. సాధించాయి.