తెలుగు దేశం పార్టీకి 4 సీట్లే వస్తాయి – విజయసాయి సంచలనం

vijay-ax.jpg

తెలుగు దేశం పార్టీకి 4 సీట్లే వస్తాయంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబూ…! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో నీకు వచ్చింది 23 స్థానాలే వచ్చినట్లు పేర్కొన్నారు విజయ సాయిరెడ్డి.

ఈ సారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు అంటూ చురకలు అంటించారు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నదని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ? అంటూ సెటైర్లు పేల్చారు. ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి…నీ మీద జాలేస్తోందని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

Share this post

scroll to top