ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివా లయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమై వ్యవసాయ రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలపై చర్చించి ఖరారు చేయనుంది. రుణమాఫీకి అర్హులను గుర్తించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం విధివిధానాలనే వర్తింపజేయాలా? లేక ఇతర పద్ధతులను అనుసరించాలా? అనే అంశంపై రాష్ట్రమంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రప్రభుత్వం దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా రూ.6 వేలు ఆర్థికసాయం అందిస్తోంది.