ఒంగోలు రిమ్స్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌..

ysr-cp-09.jpg

ఒంగోలు రిమ్స్ వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. లైంగిక దాడికి గురైన మైనర్ బాలికను పరామర్శించేందుకు రిమ్స్ కి వెళ్లిన మాజీమంత్రి అధిమూలపు సురేష్ , పిడిసిసి బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ వెంకయ్య ,వరికూటి అశోక్ బాబుల‌ను రిమ్స్ లో  పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వైఖరి ని నిరసిస్తూ నేల పై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెల‌ప‌డంతో అనంతరం బాలిక తల్లిదండ్రులు తో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కారుమంచికి చెందిన బాలిక స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. గురువారం స్కూలుకు వెళ్లకుండా ఇంటివద్దే ఉండడంతో తల్లికి అనుమానం వచ్చింది. బాలికను పరిశీలించి, స్థానికంగా వైద్యం చేయించారు. లైంగిక దాడి జరిగిందనే అనుమానంతో ఒంగోలు జిజిహెచ్‌కు తీసుకెళ్లగా లైంగిక దాడి జరిగిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మైనర్‌ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన స్కూల్ ఉపాధ్యాయుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండు చేశారు.

Share this post

scroll to top