బాదం నూనెలో విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది. తేలికైనది, త్వరగా శోషించబడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. తేమను నిలుపుతుంది. పొడిని తగ్గిస్తుంది. కాలిస్‌లను మృదువుగా చేస్తుంది. ఇది చర్మ సమస్యల్ని తగ్గించడమే కాకుండా యూవీ రేడియేషన్ దెబ్బతినకుండా చర్మాన్ని కాపాడుతుంది. చర్మం తేమను కాపాడుతుంది.
బాదం నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ప్రకాశవంతమైన చర్మాన్ని, సహజ సౌందర్యాన్ని అందజేస్తుంది. బాదం నూనెలోని విటమిన్ ఇ చర్మానికి నిగారింపునిస్తుంది. చర్మం ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య చాయలను దూరం చేస్తుంది. బాదం నూనె ముఖానికి, చర్మానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది. కాబట్టి, బాదం నూనెని చర్మానికి ముఖానికి రాయడం మంచిది.