తెలంగాణలో నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది ప్రభుత్వం. ఇటీవలే రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అలాగే ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వైద్యారోగ్య సర్వీసు నియామక బోర్డు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.