తెలంగాణ అసెంబ్లీలోనే కాదు.. శాసన మండలిలో సైతం బీఆర్ఎస్‌కు బలం తగ్గుతోంది. మండలిలో 21కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బలం తగ్గింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు చేరారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత మరో ముగ్గురు చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరనేది చూద్దాం.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
1. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
2. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
3. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేరిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
4. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
5. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రావు
6. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు
1. దండే విఠల్ (ఆదిలాబాద్ లోకల్ బాడీ)
2. భాను ప్రసాద్ (కరీంనగర్ లోకల్ బాడీ)
3. ఎం. ఎస్ ప్రభాకర్ (రంగారెడ్డి లోకల్ బాడీ)
4. ఎగ్గే మల్లేష్ (ఎమ్మెల్యే కోటా)
5. బొగ్గవరపు దయానంద్ (గవర్నర్ కోట )
6. బసవరాజ్ సారయ్య (గవర్నర్ కోట)
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీరే..
- జీవన్ రెడ్డి
- బల్మూర్ వెంకట్
- మహేష్ కుమార్ గౌడ్
- తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న ఎమ్మెల్సీలు
- కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి
- పట్నం మహేందర్ రెడ్డి
తాజాగా చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ సంఖ్యా బలం 12కు చేరింది.