రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల భూములు తాకట్టు అని ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనంపై ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. కాంగ్రెస్ సర్కార్ పై పలు విమర్శలు చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం అని అన్నారు. అలాగే దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలిపారు.