కాంగ్రెస్ ని వీడే ప్రసక్తే లేదు భట్టి తో భేటీ అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య..

cong-25.jpg

తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని..చేరికల విషయంలో మనస్థాపం చెందానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నానన్నారు. ఎమ్మెల్సీ గా అసెంబ్లీకి వెళ్ళే హక్కు నాకు ఉందని..నా కార్యకర్తలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు ముగిశాయి. అనంతరం జీవన్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..”ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు. మా అందరికీ మార్గదర్శకులు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి అనుభవాన్ని ప్రభుత్వ నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పది సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి. ఈ ప్రభుత్వం నడవడం కోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియార్టీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సమచిత ప్రాధాన్యమిస్తూ గౌరవిస్తుంది. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మనస్థాపం పడితే మేమందరం బాధపడతాం.” అని వ్యాఖ్యానించారు.

Share this post

scroll to top