చెవులు వినిపించకపోవడం సాధారణంగా వయసు మళ్లిన వారిలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారిలో తరచుగా ఈ సస్య కనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు తక్కువ వయసున్న వారిలో కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య కాలంలో 50 ఏళ్లు కూడా నిండని వారిలో చెవులు వినిపించకపోవడం ఒక సమస్యగా మారుతోంది. వినికిడి శక్తి తగ్గడానికి వయసు పెరగడం ఒక్కటే కారణం కాదని, మరెన్నో కారణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో కూడా ఈ సమస్య కనిపించినట్లు నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ ప్రారంభ దశలో అల్కా యాగ్నిక్ వైరస్ బారినపడిన వారిలో చెవుడు సమస్య కనిపించందని చెబుతున్నారు. కరోనా సమయంలో వాసన గుణం కోల్పోయినట్లే కొందరిలో వినికిడి శక్తి కూడా తగ్గినట్లు తేలింది.