హిందూ మతంలో, అపర ఏకాదశి పండుగను ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. అపర ఏకాదశి విష్ణువుకు అంకితం చేసిన రోజు. ఈ ఏకాదశిని ఈ ఏడాది జూన్ 2న 2024లో జరుపుకోనున్నారు. అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని పూజించడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్మకం. అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం ద్వారా ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అంతే కాకుండా గ్రహ దోషాలు కూడా పరిష్కారమవుతాయని భక్తులు నమ్ముతారు.
అపర ఏకాదశి వ్రతంలో ప్రజలు కొన్ని ప్రత్యేక విషయాలలో శ్రద్ధ వహించాలంటున్నారు పండితులు. ఎందుకంటే చిన్న పొరపాటు వల్ల ఉపవాస ఫలితం దక్కకపోవచ్చు. ముఖ్యంగా అవివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభం కలుగుతుంది. సంపదను పెంచుకోవడానికి కూడా ఈ ఉపవాసం ఉండవచ్చంటున్నారు పండితులు. అపర ఏకాదశి రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధమని భావిస్తున్నారు. దీని కారణంగా ఉపవాసం పూర్తిఫలితాలు రావు. జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు.