చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ షేర్ విలువ హటాత్తుగా పెరిగి ఒకరోజులోనే 521 కోట్ల సంపద వచ్చిందని, ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేయరా అని అడిగారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కనుక వీరంతా పునీతులు అయిపోయినట్లేనా? అవినీతిపరులు నితిమంతులు అయినట్లేనా? అని ఆయన అన్నారు. నిజానికి ఇంత కీలకమైన ప్రశ్నకు మోదీ స్పష్టమైన సమాధానం ఇచ్చి ఉండాల్సింది. కాని ఈ విషయంలో ఆయన కూడా నైతికంగా దెబ్బతిన్నారని చెప్పక తప్పదు. బీజేపీతో కలవకముందు అజిత్ పవార్ కాని, ప్రఫుల్ల పటేల్ కాని పలుమార్లు ఈడీ విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. బీజేపీతో సంబంధం పెట్టుకోగానే, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది.. అలాగే ఈడి గోల కూడా పోయింది. చంద్రబాబు విషయం చూస్తే మరీ ఆసక్తికరం అని చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, మోదీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మోదీని టెర్రరిస్టు అని, అవినీతి పరుడని, భార్యనే ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలుతాడని పలుమార్లు ధ్వజమెత్తారు.
- Home
- News
- Andhra Pradesh
- ఇలా మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్తేంకాదుగా..