ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా కేఎస్ జవహర్‌రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 6497 శాంపిల్స్‌ను పరీక్షించగా 71 మంది కరోనా నిర్ధారణ అయిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కొత్తగా అనంతపురం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 3, తూర్పు గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 4, వైఎస్సార్ జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 43, నెల్లూరు జిల్లాలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి

ఏపీలో కొత్తగా 71 కరోనా కేసులు