ఆ రాష్ట్రంలో అమీబా టెర్రర్ మెదడును తినేస్తూ ప్రాణాలు తీస్తున్న వైనం..

amiba-09.jpg

మెదడును తినేస్తున్న ఓ అమీబా అందరిలోనూ టెర్రర్ పుట్టిస్తోంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఆ వ్యాధి బారిన పడి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా కలుషిత నీటితో స్నానం చేస్తే.. అమీబా ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి బాడీలోకి ప్రవేశిస్తుంది. అనంతరం అది మెల్లగా మెదడుపై దాడి చేస్తుందని వైద్యులు వెల్లడించారు. అమిబా వైరస్ అంటువ్యాధి కాదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని డాక్టర్లు తెలిపారు. అయితే కేరళ రాష్ట్రంలో వైద్య శాఖ అమీబా ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకునేందుకు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.

Share this post

scroll to top