రాష్ట్రంలో ఓటు ఉన్న హైదరాబాద్వాసులకు MLA, MP అభ్యర్థులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటరు లిస్టుల్లో పేరున్న వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గానికి 20 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బస్సుకు రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు టాక్. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఈ బస్సులు HYD నుంచి రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు బయల్దేరనున్నాయి.