రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కృష్ణాపురం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. 10వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని చెన్నై పోర్టు నుంచి ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో మార్చి 31లోగా ఎగుమతులు పూర్తి చేయాలని ఆదేశించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసినందుకు రైతు సంఘాల నేతలు ఢిల్లీలో.. వైఎస్సార్‌సీపీ ఎంపీలను పార్లమెంట్ ఆవరణలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.