బొగ్గుగనుల వేలం ప్రక్రియను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమన్నారు. తెలంగాణ ప్రభుత్వ వినతిని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం జరగనివ్వమన్నారు. దాంతోపాటు నైని కోల్ బ్లాక్ విషయంలో ఒడిశాతో మాట్లాడి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు కిషన్‌రెడ్డి. బొగ్గు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదన్నారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికే ఈ బొగ్గుగనుల వేలం ప్రక్రియ జరుగుతుందన్నారు. మార్కెట్‌లో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో పరిశ్రమల కోసం ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ఆందోళన చేసేవారు. ఇప్పుడు వ్యవసాయం, కమర్షియల్, గృహ అవసరాలకు..తగినంతగా విద్యుత్ అందుబాటులో ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు.