స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?

stle-plant-10.jpg

మూడు సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తున్న కార్మికులతో పాటు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన ఆంధ్రప్రదేశ్ అభిమానులందరికీ సంతోషం కలిగించే వార్త రాబోతోందా? విశాఖ స్టీల్ ప్లాంట్‎ని ప్రైవేట్ పెట్టుబడుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించబోతుందా? కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డి కుమారస్వామి నేడు, రేపు విశాఖ పర్యటన అందుకోసమేనా? పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేసిన సెయిల్‎లో విలీనం ప్రతిపాదన చర్చకు రాబోతోందా? ఒక పర్యటన 100 సమాధానాల కోసం ఎదురుచూస్తోంది. నేడు విశాఖకు కేంద్ర స్టీల్ మినిస్టర్ హెచ్ డీ కుమారస్వామి రాబోతున్నారు. స్టీల్ ప్లాంట్‎లోనే బస చేయబోతున్నారు. రేపు ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలతో సమావేశం కాబోతున్నారు. పూర్తి స్థాయి ఉత్పత్తికి వర్కింగ్ క్యాపిటల్ లేక నష్టాల ఊబిలో ఉన్న స్టీల్ ప్లాంట్‎ను సెయిల్‎లో విలీనం చేయాలని విజ్ఙప్తి చేశారు ఏపీ ఎంపీలు.

Share this post

scroll to top