విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్రమంత్రి పచ్చజెండా..

bjp-04.jpg

విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. అందులో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యినట్లు ఎంపీ తెలిపారు. చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు సహా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి పచ్చజెండా ఊపినట్లు ఎంపీ చెప్పారు. వీటంన్నింటిపై త్వరలోనే ఆదేశాలు రానున్నట్లు కేశినేని శివనాథ్ చెప్పుకొచ్చారు.

Share this post

scroll to top