వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..

vamsi-11.jpg

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు న్యాయస్థానానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వంశీని 71వ నిందితుడిగా పేర్కొనడం జరిగింది. అరెస్టుల భయంతో వైసీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. త్వరలోనే అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సర్వం సిద్ధం అవుతోందని తెలియవచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో కొందరిని పోలీసులు నిన్ననే అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయం ఆపరేటర్‌ ముదునూరి సత్యవర్ధన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్‌ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు (క్రైమ్‌ నంబర్‌ 137/2023) నమోదు చేశారు.

Share this post

scroll to top