బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? కొన్ని పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల తొందరగా బరువును తగ్గించుకోవచ్చు. తక్కువ క్యాలరీ కంటెంట్, అధిక ఫైబర్, రిచ్ న్యూట్రీషియన్ ప్రొఫైల్స్‌తో మంచి ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లను ప్రోటీన్ కలిగిన పెరుగు లేదా గింజలతో కలిపి తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
*యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెక్టిన్, ఎక్కువసేపు నిండుగా అనిపించేలా చేస్తుంది.
*బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జీవక్రియను పెంచుతాయి. పెరుగు, వోట్మీల్, స్మూతీస్ మాదిరిగా తీసుకోండి.
*గ్రేప్‌ఫ్రూట్ ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. బరువు తగ్గవచ్చు.
*నారింజలో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటుంది. జ్యూస్ కాకుండా పండుగా నేరుగా తీసుకోండి.
*బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకు అవసరమయ్యే పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
జ్యూస్‌లతో పోలిస్తే.. పండ్లు ఎక్కువ ఫైబర్ పోషకాలను అందిస్తాయి. మీ ఆహారంలో ఈ పండ్లను చేర్చడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.