జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు అంటూ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విద్య, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైయస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పెనమలూరు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.