ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు. “రామోజీ రావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.