పులివెందులలో మూడో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన..

ys-jagan-24-.jpg

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన మూడో రోజుకి చేరింది. ఈ పర్యటనలో రెండు రోజుల పాటు ఆయన ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఇవాళ్టితో ఆయన తన పర్యటన ముగించుకోనున్నట్లు సమాచారం.  సోమవారం మధ్యాహ్నం వరకు పులివెందుల క్యాంపు అఫీసులోనే వైఎస్ జగన్ ఉండనున్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఆయన కలుస్తారు. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక సొంత నియోజకవర్గం పర్యటన కోసం వచ్చిన వైఎస్‌ జగన్‌కు పులివెందుల ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది. రెండు రోజులపాటు ఆయన్ని కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలు క్యూ కట్టారు.  ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా మీ వెంటే ఉన్నామంటూ నియోజకవర్గం.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజానీకం తమ నినాదాలతో చాటి చెప్పింది. మరోవైపు తనను కలిసేందుకు వచ్చిన పార్టీ కేడర్‌ను ఓదారుస్తూ.. మంచి రోజులు త్వరలోనే వస్తాయని జగన్‌ ధైర్యం చెప్పారు.

Share this post

scroll to top