విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వైయస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రాతాల్లో జరుగుతున్న సహాయ చర్యల్లో పార్టీ నేతలు నేతలు, కార్యకర్తలతో కలిసి వైయస్ జగన్ పాల్గొన్నారు. నగరంలోని ఓల్డ్ ఆర్ ఆర్ పేటను సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితుల సమస్యలను వైయస్ జగన్ అడిగి తెలుసుకుంటున్నారు.
పలు ప్రాంతాలను పరిశీలించిన వైయస్ జగన్ కు తమ గోడును చెప్పుకుంటున్నారు. మూడు రోజులు నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం ఏమైనా అందుతుందా? అని వైయస్ జగన్ బాధితులను ఆరా తీశారు. ఇప్పటి వరకు మా కోసం ఏ నాయకుడూ రాలేదు. జనం కోసం మీరు వచ్చారని స్థానికులు పేర్కొన్నారు. ఫస్ట్ ఫ్లోరోలో చిన్న పిల్లలతో రెండు రోజుల నుంచి ఉన్నాం. నీళ్లు లేవు, తిండి లేదు. బోట్లు ఎందుకు ఉపయోగపడం లేదని పేర్కొన్నారు. నిజమైన బాధితులకు బోట్లు ఇవ్వలేదు. పిల్లలు కూడా తిండి లేకుండా ఉన్నారని తమ గోడును వైయస్ జగన్ ముందు వెల్లగక్కారు.