నెట్టింట ట్రోల్ అవుతున్న షర్మిల వీడియో..

ys-sharmala-5.jpg

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల మరోసారి ట్రోలింగ్‌గా మారారు. గతంలో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి నవ్వుల పాలైన ఆమె తాజాగా వర్షాకాలానికి అలాంటి సమాధానమే చెప్పింది. విజయవాడలో పర్యటించిన షర్మిల మీడియాతో మాట్లాడుతూ రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్‌. కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరిగా ముందుకు ముందే ప్రభుత్వాలు, అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోనే రైనీ సీజన్ మొదలు నుంచి ఉండాలని కాంగ్రేస్ పార్టీ కోరుతుంది అని చెప్పేశారు. అంతే దీంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Share this post

scroll to top