వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

మాజీమంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో.. సిబిఐ వేసిన నార్కో పిటిషన్‌ను పులివెందుల కోర్టు డిస్మిస్‌ చేసింది. నిందితుడు ఉమాశంకర్‌ రెడ్డికి నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సిబిఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం పులివెందుల మెజిస్ట్రేట్‌ విచారణ చేపట్టింది. రిమాండు ఖైదీగా కడప కారాగారంలో ఉన్న ఉమాశంకర్‌ రెడ్డిని దూరదఅశ్య మాధ్యమం ద్వారా మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ విచారణలో భాగంగా… నార్కో పరీక్షలు చేయించుకోవడం సమ్మతమేనా అని పులివెందుల మెజిస్ట్రేట్‌ అడగగా… అందుకు తాను సుముఖంగా లేనని ఉమాశంకర్‌ చెప్పారు. దీంతో సిబిఐ వేసిన పిటిషన్‌ను మెజిస్ట్రేట్‌ తిరస్కరించారు. గతంలో సునీల్‌ యాదవ్‌ కు నార్కో పరీక్షలు నిర్వహించడానికి వేసిన పిటిషన్‌ ను కూడా జమ్మలమడుగు కోర్టు తిరస్కరించింది. వారం కిందట మున్నా అనే వ్యక్తికి నార్కో పరీక్షలు చేయించడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ వేసిన పిటిషన్‌ పై అతని సమ్మతితో కోర్టు అనుమతి మంజూరు చేసింది.