13 ఏళ్ల క్రితం పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణలో.. నాన్న గారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం, అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి, వెన్నుదన్నుగా నిలిచి.. మన పార్టీ జెండా తమ గుండెగా మార్చుకున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమ పూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యులుగా సెల్యూట్ చేస్తున్నా’’ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు ఏఎన్‌యూ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశాలను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.