ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌లమీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్నే మాజీ మంత్రి, సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ రాజీనామా చేసిన విషయం విదితమే కాగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారట రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారట ఉదయభాను రేపు నియోజక వర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న ఉదయభాను తన నిర్ణయాన్ని కార్యకర్తలతో పంచుకుంటారని తెలుస్తోంది.. అయితే, ఆరు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచిన ఉదయభాను రెండు సార్లు ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
- Home
- News
- Andhra Pradesh
- వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు..