మళ్లీ చంద్రబాబు మోసం.. ఉచిత ఇసుక ఒట్టిదే..

cbn-09.jpg

ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని తేలిపోయిందని వైఎ​స్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. ఆయన మంగళవారం ఏపీ సర్కార్‌ చేస్తున్న మోసంపై మాట్లాడారు. చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారు. స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. దీన్ని ఉచిత ఇసుక అంటారా?. రీచ్‌ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతోంది?. గతంలో రూ.750 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది?. 2014-19 మధ్య చేసిన అక్రమాలే మళ్ళీ ఇసుక పేరుతో చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు విక్రయించిన రేట్లకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా విక్రయించింది. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఉచితం అని చేస్తున్నదేమిటి?. చంద్రబాబు ఎన్నికల హామీలు, అధికారంలోకి వచ్చాక చేసే పనులకూ ఎప్పుడూ పొంతన ఉండదు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కటం అనేది చంద్రబాబుకు సహజ నైజం. 

Share this post

scroll to top