ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ను క‌లిసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు..

ambati-27.jpg

ఏపీలో పోలింగ్ శాతం వివ‌రాల‌పై త‌మ‌కు అనుమానం ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. ఇవాళ సచివాలయంలో లో స్టేట్  ఎలక్షన్ కమిషన్ ను  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు,  మేరుగు నాగార్జున , ఎమ్మెల్సీ  లేళ్ల అప్పిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు  ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్ ను వైయస్ఆర్ సీపీ నేతలు కలిసి ఫారం 20 సమాచారాన్ని అప్ లోడ్ చేయలేదని ఫిర్యాదు చేశారు.  

అనంత‌రం మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  ఏపీలో పోలింగ్ శాతం వివ‌రాల‌పై త‌మ‌కు అనుమానం ఉంద‌ని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. పోలింగ్ శాతాన్ని ఈసీ మూడుసార్లు వేర్వేరుగా వెల్ల‌డించింద‌న్నారు. ఈ విషయంలో మాకు రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయ‌ని చెప్పారు.  ఏయే అసెంబ్లీలో ఎంత‌శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది? ఒక్కొ అభ్య‌ర్థికి ఎంత‌శాతం ఓట్లు వ‌చ్చాయో ఈసీ వెల్ల‌డించ‌డం లేద‌న్నారు.  ఈవీఎంలో ఎన్ని ఓట్లు ప‌డ్డాయో వీవీపాట్‌లో కూడా అన్నే చూపించాల‌న్నారు. కానీ ఏపీలో అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేస్తార‌ని మొద‌ట చంద్ర‌బాబే అన్నార‌ని గుర్తు చేశారు. గ‌తంలో ఈవీఎంల‌పై చంద్ర‌బాబు ఫిర్యాదు చేశార‌న్నారు.  మా అనుమానాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ నివృత్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. త్వ‌ర‌లో మా సందేహాల‌కు ఈసీ క్లారిటీ ఇస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

Share this post

scroll to top