చంద్రబాబుపై  తీవ్రస్థాయిలో మండిపడ్డ వైవీ సుబ్బారెడ్డి..

yv-subba-19.jpg

మంగళగిరిలో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో అవినీతి చోటు చేసుకుందని లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల ఎముకలతో చేసిన ఆయిల్ ను ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమలపై ఏ రాజకీయ నాయకుడు చేయని వ్యాఖ్యలు చంద్రబాబు చేశారన్నారు.

నిన్న చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని. టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో తిరుమల పవిత్రతను కాపాడామని చెప్పుకొచ్చారు. అలాగే తాను వెంకటేశ్వర స్వామి పాదాలచెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అలాగే సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.

Share this post

scroll to top