తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కోట మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్దపాపమే చేశారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరని మరోసారి నిరూపితమైందన్నారు. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ విషయంపై వైసీపీ ఘాటుగా స్పందించింది. రుమల లడ్డూ అపవిత్రంపై చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబం ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా? తాము సవాల్ చేస్తున్నామని రాసుకొచ్చింది. సీఎం చంద్రబాబు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ మండిపడింది.
- Home
- News
- Andhra Pradesh
- తిరుమల లడ్డూపై అపవిత్రం ఆరోపణలు..