పొంగులేటి నివాసంపై ఈడీ దాడి..

poguleti-27.jpg

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సీఆర్పీఎఫ్‌ పోలీసుల భద్రత నడుమ హైదరాబాద్‌లోని మంత్రి పొంగులేటి ఇంటితోపాటు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నాయి. కాగా, గతేడాది నవంబర్‌లో పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. నవంబర్‌ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో రాఘవా ప్రైడ్‌లోనూ సోదాలు నిర్వహించారు.

Share this post

scroll to top