News

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాజీనామా

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ  రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు. మాజీ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ అనంతరం 2016 డిసెంబర్‌ 31న లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బైజల్‌ బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో వివాదంతో బైజల్  పలుసార్లు వార్తల్లో నిలిచారు.

Read More »

మెగా పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన జగన్‌

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులోని ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను మంగళవారం ప్రారంభించారు. ఒకే యూనిట్‌ నుంచి సోలార్‌, విండ్‌, హైడల్‌ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 5,230 మెగావాట్ల ఉత్పత్తి చేస్తారు.

Read More »

రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన జగన్‌

వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది.ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. 

Read More »

తిరుపతిలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటన

 రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ కె.వెంకట రమణా రెడ్డి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుండి 11 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి అనంతపురం జెఎన్‌టియులో జరగనున్న కాన్వొకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్‌ కె .వెంకటరమణా రెడ్డి, ఎస్‌ పి.పరమమేశ్వర రెడ్డి, ఆర్డీఓ హరిత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, సిఐఎస్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ శుక్లా, తహసీల్దార్‌ శివప్రసాద్‌, ఎంపిడిఓ, తదితరులు గవర్నర్‌కు స్వాగతం ...

Read More »

వరుసగా నాలుగో ఏడాది వైయస్ఆర్ మత్స్యకార భరోసా

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కోనసీమ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఐ పోలవరం మండలం మురమళ్ల‌లో నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఆయ‌న‌ ప్రారంభించి, అనంత‌రం మురమళ్ల‌ వేదికపై ప్ర‌సంగించారు. భ‌గ‌వంతుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ‌ని, దాదాపు 1,09,000 మందికి మంచి జరిగే కార్యక్రమాన్ని ముమ్మడివరంలో చేయబోతున్నామ‌ని చెప్పారు.ఇందులో భాగంగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్ల రూపాయ‌లు జమ చేస్తున్నామ‌ని ...

Read More »

రోడ్ల ప్రగతికి ఏడాది గడువు : జగన్‌

రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. విపక్షాల విమర్శలను చాలెంజ్‌గా తీసుకుని, గుంతలు లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. రోడ్ల అభివృద్ధి ప్రగతిపై అధికారులకు ఏడాది గడువును నిర్దేశించారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌శాఖల రోడ్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన రోడ్ల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7,804 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బి రోడ్ల అభివృద్ధికి రూ.2,500 కోట్లను, పంచాయతీరాజ్‌ (పిఆర్‌) ...

Read More »

పరిశ్రమలకు 70 శాతం విద్యుత్‌ సరఫరా : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పరిశ్రమలకు వారంలో అన్ని రోజులపాటు విద్యుత్‌ సరఫరా చేసేందుకు, 70 శాతం మేర విద్యుత్‌ వినియోగానికి అవకాశం కల్పించినట్లు విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 235 మిలియన్‌ యూనిట్ల నుంచి 186 మిలియన్‌ యూనిట్లకు తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు సరఫరాను పెంపొందించే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read More »

ఎపి, ఒడిస్సాలపై అసాని ప్రభావం

ఎపి, ఒడిస్సాలపై అసాని తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. తుఫాను ఎపిలోని తూర్పుతీరంలో కేంద్రీకృతమైందని, గంటకు 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. తుఫాను క్రమంగా బలహీన పడుతోందని, మంగళవారం రాత్రి నుండి ఎపిలోని ఉత్తర కోస్తాతో పాటు ఒడిస్సాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఇప్పటికే ఎపిలోని విశాఖ పట్నం పోర్ట్‌ను మూసివేశారు. వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా 23 విమానాలను రద్దు చేసినట్లు విశాఖ పట్నం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్‌ ...

Read More »

దక్షిణాఫ్రికాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నెమ్మదించినా.. కొన్ని దేశాల్లో వైరస్‌ ఉధృతి అధికంగా ఉంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల వ్యాప్తితో రికార్డు  స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. ఐదు నెలల అనంతరం ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉపరకాల ప్రభావంతో దక్షిణాఫ్రికాలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 8,524 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 31.1శాతం ఉన్నట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల ...

Read More »

సామాన్యులకి షాక్‌.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధర

గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు మరో షాక్‌నిచ్చాయి. గ్యాస్‌ ధర మరోసారి పెరిగింది. ఈ నెల 1 న కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌పై ధరను పెంచింది. 14 కేజీల సిలిండర్‌ పై రూ.50 వడ్డించింది. ఈ మేరకు దేశీయ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1052 కు చేరింది. దీనికి డెలివరీ బార్సు తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ...

Read More »