కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలు ఆలస్యానికి కారణమేంటో కాంగ్రెస్ నేతలు జవాబు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని, ఆ పార్టీ ఇప్పటి వరకు చేసిన అవినీతి, అక్రమాలు చాలు అని ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమ సంపాదనతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.