నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ..షెడ్యూల్ ఇదే

modi4.jpg

నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ పయనం కానునన్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఇవాళ తెలంగాణ పర్యటన ముగిసిన తర్వాత అంటే… మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. అనంతరం తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్నారు మోడీ.

ఇక ఇవాళ మధ్యాహ్నం 3.45 గంటలకు కలికిరిలో ప్రధాని మోడీ బహిరంగ సభ ఉంటుంది. సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ వస్తారు. అనంతరం ఇవాళ సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్‌ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియానికి మోడీ వెళతారు. స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్‌ షో ఉంటుంది. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ పయనం అవుతారు.

Share this post

scroll to top