ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అదే సమయంలో సత్యసాయి, విజయనగరం, ప్రకాశం, మన్యం, కాకినాడ, వైఎస్సార్ కడప, అనకాపల్లి, అనంతపురం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు.
ఉరుములతో కూడి వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు, రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని రోణంకి కూర్మనాథ్ వివరించారు.