భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 3,20,418 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా కొత్తగా 5,439 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, రికవరీ రేటు 98.66 శాతంగా, క్రియాశీల రేటు 0.15 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 88.55 కోట్ల కోవిడ్ టెస్టులను నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఇప్పటి వరకు 212.17 ...
Read More »Author Archives: News
తనను ట్రోలింగ్ చేస్తున్నవారిపై యాంకర్ అనసూయ ఫిర్యాదు
టాలీవుడ్ స్టార్, బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ను టార్గెట్ చేస్తూ గత కొద్దిరోజులుగా నెటిజన్లు సోషల్‌మీడియాలో అసభ్యకరమైన రీతిలో రచ్చ చేస్తున్న సంగతి విదితమే. దీనిపై మండిపడ్డ యాంకర్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని నెటిజన్లు మరింతగా ఆంటీ అంటూ వేలకొద్దీ ట్వీట్లు చేసి అసభ్యపదజాలాలు వాడారు. దీనిపై తాజాగా అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More »2023 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామంలో జియో 5జీ సేవలు
డిసెంబర్ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని రిలయన్స్ ఇండిస్టీ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండిస్టీస్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముఖేష్ మాట్లాడుతూ.. జియో 5జీ సేవల్ని విస్త్రతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్ వర్క్‌లను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. దేశ మంతా హైక్వాలిటీ, హై ...
Read More »‘పెళ్లి కూతురు పార్టీ’ ట్రైలర్ విడుదల
అపర్ణ మల్లాది దర్శకత్వంలో నటి అనీషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. ఆగస్టు 31న ఆహా వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అక్క పెళ్లి కుదిరిన ఆనందంలో చెళ్లెళ్లు అందరూ రోడ్ ట్రిప్‌నకు వెళ్లి పార్టీ చేసుకుంటారు. ఆ సమయంలో వారికి ఎదురైన సంఘటనలు, వాటిని వాళ్లు ఎదుర్కొన్నారు అనే ఆసక్తికర అంశాలతో రూపుదిద్దుకుంది. యుత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నపూర్ణ కీలకపాత్ర పోషించారు.
Read More »49వ సిజెఐగా యుయు లలిత్ ప్రమాణం
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్( యుయు లలిత్) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవనలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, నవంబర్ 8 వరకు మాత్రమే అనగా కేవలం 74 రోజుల మాత్రమే సిజెఐగా ఉంటారు. ఆ సమయానికి ఆయనకు 65 ఏళ్లు నిండనున్నాయి. ఆ తర్వాత సీనియార్టీ జాబితాలో ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ...
Read More »బాలీవుడ్‌లో ‘సీతారామం’
తెలుగులో ఘన విజయం సాధించిన ‘సీతారామం’ ఇప్పుడు బాలీవుడ్‌లో సందడి చేయటానికి సిద్ధం అవుతోంది. హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఇప్పుడు సెప్టెంబర్ 2న బాలీవుడ్‌లో విడుదల కాబోతుంది. హీరోయిన్ రష్మిక కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మ్యూజికల్ లవ్ స్టోరీగా ఘన విజయం సాధించింది.
Read More »విశాఖలో జగన్ పర్యటన
జగన్ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్ ది ఓషన్’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, బీచ్ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సిఎం సందర్శించారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా నేడు బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా ...
Read More »సూర్య కొత్త సినిమా ప్రారంభం
తమిళ దర్శకుడు శివ, సూర్య కాంబినేషన్‌లో సూర్య 42వ సినిమా ప్రారంభమైంది. స్టూడియో గ్రీన్ బేనర్‌తో కలిసి టాలీవుడ్‌లో అగ్ర బేనర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్, జ్ఞానవేల్ రాజా, విక్రమ్ నిర్మించున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందడంతో పోలీసులు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజా సింగ్‌పై నమోదైన కేసుల్లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గురువారం ఉదయం షాహినాయత్ గంజ్, మంగళ్‌హట్ పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో రాజాసింగ్ ఇంటి వద్ద ...
Read More »సెట్స్ పైకి ‘ఇండియన్ 2’
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు, శంకర్‌కు మధ్య వచ్చిన గొడవలు, కరోనా వంటి కారణాలతో చిత్రీకరణ దశలోనే నిలిచిపోయింది. దాంతో శంకర్ రామ్ చరణ్ హీరోగా ‘ఆర్‌సి15’ షూట్ చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి షూటింగ్ ఆగిన నేపథ్యంలో శంకర్ ‘ఇండియన్ 2’పై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. దీనిలో భాగంగానే ఇండియన్ 2కి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ...
Read More »