దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసును తెలంగాణ పోలీసులు క్లోజ్ చేశారు. ఆయన ఎస్సీ కాదని, ఫేక్ సర్టిఫికెట్ కారణంగానే సూసైడ్ చేసుకుని ఉంటాడని పేర్కొంటూ కేసును క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీ యూ) విద్యార్థులతో పాటు వివిధ సంఘాలు, రోహిత్ వేముల తల్లి రాధిక వేముల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం హెచ్ సీయూ ఎదుట భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎనిమిదేళ్లుగా కొనసాగిన దర్యాఫ్తును నిలిపివేయడం, రోహిత్ వేముల ఎస్సీ కాదని తేల్చడంపై మండిపడ్డారు.