నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే

jagan1.jpg

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు పార్లమెంట్ ఎలక్షన్స్ కు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార వైఎస్సార్సీపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారం కోసం పావులు కదుపుతోంది. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా తన ఉనికి కోసం పోరాడుతోంది. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో జోరు సాగిస్తున్నారు. రోజు మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా ఈరోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్ లో జనగ్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇక్కడ జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్ సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్ లో జరిగే సభకు హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్ సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర లో జరిగే సభలో పాల్గొంటారు.

Share this post

scroll to top