సిటీ బస్‌‌ ఎక్కిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్.. యువతుల్లో జోష్!

rahul-.jpg

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకపోతోంది. తెలంగాణలో మెజార్టీ గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న సరూర్‌నగర్ స్టేడియంలో జన‌జాతర సభ నిర్వహించారు. సభ అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సిటీ బస్సులో ప్రయాణించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా దిల్ సుఖ్ నగర్ వద్ద రాహుల్, సీఎం రేవంత్ ఆర్టీసీ బస్సు ఎక్కారు.

సిటీ బస్సు ఎక్కడమే కాకుండా బస్సులోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలను రాహుల్ అందించారు. మరోవైపు తెలంగాణలో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి రాహుల్ మహిళలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు రాహుల్ వివరించారు.

Share this post

scroll to top