KCR అసెంబ్లీకి రాకపోవడానికి కారణం అతడే: CM రేవంత్

revanthb1q1.jpg

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనక మాజీ మంత్రి హరీష్ రావు కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం వల్ల ఒక్క హరీష్ రావుకు మాత్రమే లాభమని అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని, హరీష్ రావు ట్రాప్‌లో పడొద్దని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని చెప్పారు. ఇక, ఎవరైనా తనకు జోలికి వస్తే ఊరుకునే వ్యక్తిని కాదని, ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయిస్తానని అన్నారు. కేసీఆర్‌తో ఎందుకుని గతంలో జానారెడ్డి, జైపాల్ రెడ్డి వదిలేశారు కానీ తాను అలా కాదన్నారు.

Share this post

scroll to top