ఏపీలో లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్క రోజే ఖాతాల్లోకి డబ్బులు

ap-ovet.jpg

ఏపీలో ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. డీబీటీ ద్వారా ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు ఒక్క రోజు అనుమతి ఇచ్చింది. లబ్ధిదారులకు ఈ రోజులేనే నగదు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. డబ్బులు జమ తర్వాత అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు, ర్యాలీ, బాణా సంచా కాల్చడం వంటివి చేయొద్దని సూచించింది. నిబంధనలు అతిక్రమించొద్దని హెచ్చరించింది.

పలు పథకాలకు ప్రభుత్వం బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో డీబీటీ ద్వారా నగదు జమ చేసేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. దీంతో హైకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. ఈసీ, ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు డబ్బులు జమ చేసేందుకు ఈ ఒక్క రోజు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ప్రభుత్వం, ఈసీ కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది.

Share this post

scroll to top