Tag Archives: ap

AP పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. తెరపైకి బీజేపీ ‘కాపు సీఎం’ నినాదం

ఏపీ పాలిటిక్స్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. క్రమంగా ఆంద్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుకు బీటలు వారుతున్నాయి. బీజేపీ హై కమాండ్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టింది. ఏపీలో కాపు నినాదం అందుకోవాలని ఆ పార్టీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘కాపు సీఎం’పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీసీ సీఎం తరహాలో ఏపీలో కాపు సీఎం నినాదాన్ని బీజేపీ ఎంచుకున్నట్లు సమాచారం. టీడీపీ కమ్మ, వైసీపీ రెడ్డి సీఎంల నేపథ్యంలో కాపులను దగ్గరకు చేర్చుకునే వ్యూహాన్ని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరో ...

Read More »

ఏపీలో కాంగ్రెస్ తొలి భారీ బహిరంగ సభ.. హాజరవుతున్న రేవంత్ రెడ్డి!

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. షర్మిల బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. ఈ నెల 25న జరగబోతున్న ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు హాజరవుతున్నారు. ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏపీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసేలా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల ...

Read More »

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

గ్రూప్-1, 2 పోస్టుల భర్తీ చేపడుతున్న APPSC.. త్వరలోనే 861 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆర్థిక శాఖ అనుమతించడంతో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదార్లు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 పోస్టులకు వారంలో ప్రకటన ఇవ్వనుంది.

Read More »

ఏపీలో పొత్తులపై అమిత్ షా బాంబ్ పేల్చారు..!

ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పొత్తులపై స్పందించారు. ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి నుంచి మిత్రులను తామెప్పుడూ బయటికి పంపలేదని స్పష్టం చేశారు. వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా వారే కూటమి నుంచి బయటికి వెళ్లి ఉండొచ్చని అమిత్ షా పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు.

Read More »

ఏపీలో జోరుగా ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 30.61 లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం సచివాలయాల పరిధిలో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 10వేలకుపైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాటు చేశామన్నారు. కన్వెయన్స్ డీడ్స్ ను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరి మూడో వారంలో సీఎం జగన్ ప్రారంభించే అవకాశం ఉంది.

Read More »

ఎపి, తెలంగాణ కొట్టుకుంటే.. కేంద్రం పెత్తనం చేస్తోంది..!

రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు, అధికారాలు లేకుండా బలమైన కేంద్రం ఉండాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాకు అనుగుణంగానే మంగళవారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉంది. బోర్డుల పరిధి, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు అనుమతులు వంటి విషయాల్లో తుది నిర్ణయం తమదేనని చెప్పడం రాష్ట్రాల హక్కులను హరించడమే. ట్రిబ్యునల్‌ కేటాయిపుల ఆధారంగా రాష్ట్రాలు ప్రాజెక్టులను చేపట్టడం సర్వసాధారణం.. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి అనేది రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యవహారం. ప్రాజెక్టుల నిర్వహణ ...

Read More »

ఏపీ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ‌ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచాన వేసింది. ఉత్తర కోస్తాంద్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో 19 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ...

Read More »

ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు

వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3 నుండి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశముందని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. ...

Read More »

మంత్రి వేణును కలిసిన ఐఏఎస్‌ అధికారులు

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను పలువురు జిల్లాకు చెందిన ఐఏఎస్‌ అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి విచ్చేసిన మంత్రి వేణును జిల్లా జాయింట్‌ కలెక్టర్లు డాక్టర్‌ జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, ట్రైనీ కలెక్టర్‌ అపరాజితా సింగ్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్‌–19 నియంత్రణ చర్యలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రివేణు మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ...

Read More »

సబ్‌కలెక్టర్లుగా 12 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లు

2018 బ్యాచ్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లను సబ్‌కలెక్టర్లుగా నియమిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కడప సబ్‌కలెక్టర్‌గా పృథ్వీతేజ్‌, నూజివీడు సబ్‌కలెక్టర్‌గా ప్రతిస్త, అమలాపురం సబ్‌కలెక్టర్‌గా హిమాన్షు, కందుకూరు సబ్‌కలెక్టర్‌గా భార్గవ్‌తేజ, పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా విధేకర్‌, నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌గా మౌర్య, నరసరావుపేట సబ్‌కలెక్టర్‌గా అజయ్‌కుమార్‌, రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా అంజలి, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా ధనుంజయ్‌, మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా జాహ్నవి, నంద్యాల సబ్‌కలెక్టర్‌గా కల్పన, రాజంపేట సబ్‌కలెక్టర్‌గా కేతన్‌, చిత్తూరు డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఎంఎస్‌ మురళి ఉన్నారు.

Read More »