ఇటీవల తరచూ ప్రముఖ సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆయన చెప్పిన జోస్యం పలువురి సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల విషయంలో నిజమవ్వడంతో వేణు స్వామి నోట ఏ మాట వదిలిన జనాలు భయపడిపోతుంటారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వేణుస్వామి ఉన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వేణుస్వామి ఇప్పటికే తేల్చేశారు. అనేక ఇంటర్వ్యూలలో ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై వేణుస్వామి తన అంచనాలు వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించడం ఖాయమని.. పలు ఇంటర్వ్యూలలో గత రెండేళ్లుగా చెప్పిన విషయం తెలిసిందే. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కి రాజకీయ యోగం లేదనేది వేణుస్వామి జ్యోతిష్యం అంచనా. అయితే వైఎస్ జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని.. అయితే ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.