విజయ్‌ దేవరకొండకు జోడీగా ఆ బ్యూటీ..

vijay.jpg

సాయిపల్లవి సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనం ఉంటే.. పాత్రలపరంగా కూడా ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తుంటుంది. అందుకే ఈ తమిళ సోయగానికి స్టార్‌ హీరోలకు ఉన్నంత క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాగచైతన్య సరసన తండేల్‌ లో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఆమె విజయ్‌ దేవరకొండతో జోడీ కట్టబోతున్నదాట. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. దిల్‌ రాజు నిర్మాణంలో రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్‌ కథాంశమిది. ఇటీవల విజయ్‌ దేవరకొండ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. కథలోని కొత్తదనంతో పాటు తన పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించడంతో ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పిందని టాక్. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Share this post

scroll to top