ఏకంగా 10 గంటల పాటు చెత్తకుప్పలో స్టార్ హీరో ధనుష్..

dhanushhh.jpg

చాలా మంది సినిమాలోని కొన్ని సీన్స్ కోసం చాలా కష్టపడిపోతుంటారు. అంతేకాకుండా సీన్ బాగా రావాలని చెప్పి శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సినిమా కోసం ఎలాంటి పని అయినా సరే చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేరాడు. ఒక్క సీన్ కోసం ఏకంగా 10 గంటల పాటు కంపు వాసన వచ్చే చెత్తకుప్పలో మాస్క్ లేకుండా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ‘కుబేర’ మూవీ రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అలాగే ఇందులో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల ఆయనకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో కుబేర షూటింగ్‌ జరుగుతుంది.

అయితే ధనుష్ ఓ సీన్ కోసం ఏకంగా 10 గంటల పాటు డంపింగ్ యార్డ్‌లో గడిపాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఆయన మాస్క్ కూడా పెట్టుకోకుండా వాసనను భరించి సీన్ కంప్లీట్ చేసినట్లు టాక్. బిచ్చగాడి లైఫ్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించడానికి ధనుష్ అలా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం బయటకు రావడంతో అది తెలిసిన వారంతా నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share this post

scroll to top