ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని రేపల్లెలో రోడ్ షోలో పాల్గొన్నారు. రేపల్లెలో ఉన్న అంబేద్కర్ సెంటర్ ఈ రోడ్ షోకు వేదికైంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండుటెండను సైతం లెక్క చేయకుండా తన కోసం తరలివచ్చిన జనాలకు కృతజ్ఞతలు తెలిపారు. మరో వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని తెలిపారు. జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయని, అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని పేర్కొన్నారు.