సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ఎల్లుండి పీలేరులో జరిగే బహిరంగ సభ, విజయవాడలో జరిగే రోడ్ షోలో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు పోలీసులు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను భద్రతా బలగాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి.